జాతీయంతెలంగాణ

సిద్దిపేట కేవీలో సీట్లు పెంచండి

  • జావడేకర్‌కు తెరాస ఎంపీల విజ్ఞప్తి

దిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌తో తెరాస ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణలో విద్యా సంస్థల ఏర్పాటు, పలు అంశాలపై ఆయనతో చర్చించారు. సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో సీట్లు పెంచాలని కోరారు. తెరాస ఎంపీలు చేసిన విజ్ఞప్తులపై జావడేకర్‌ సానుకూలంగా స్పందించారు.