ఆంధ్రప్రదేశ్

సాయంత్రం జగన్‌ మీడియా సమావేశం

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డి ఇవాళ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తారని ఆపార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎల్లుండి వైసీపీ  శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. చంద్రబాబు పాలనపై విసుగుచెందే ప్రజలు.. జగన్‌కు పట్టం కట్టారని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలువురు నేతలు, వైసీపీ శ్రేణులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి చేరుకుని అభినందనలు తెలుపుతున్నారు.ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో  151 స్థానాల్లో వైసీపీ , 23 స్థానాల్లో టీడీపీ , ఒకస్థానంలో జనసేన అధిక్యంలో ఉన్నాయి.
ఎంపీ స్థానాల్లో వైకాపా హవా కొనసాగుతోంది. 24 ఎంపీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉండగా, ఒక స్థానంలో టీడీపీ అధిక్యం కనబరుస్తోంది.