సినిమా

సంచలన విషయం వెలుగులోకి: అతడి వల్ల ఆ బిగ్‌బాస్ బ్యూటీ గర్భం దాల్చిందా?

సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ బిగ్ బాస్ 12వ సీజన్ ఇటీవలే మొదలైంది. ఈ షోలో జోడీగా పాల్గొన్న భజన పాటల కింగ్ అనూప్ జలోటా (65), అతడి గర్ల్ ఫ్రెండ్, సింగర్ జస్లీన్ మాథరు (28) గురించి ఇంటర్నెట్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇద్దరి మధ్య చాలా కాలంగా లవ్ ఎఫైర్ ఉందనే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ ఇద్దరి గురించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వీరి మధ్య కేవలం ప్రేమ బంధం మాత్రమే కాదు, శారీరక సంబంధం ఉందని, అతడి వల్ల ఆమె గతేడాది గర్భం దాల్చినందనే విషయం తెలిసి అంతా షాకవుతున్నారు.

విషయం లీక్ చేసిన అనీషా సింగ్ అనూప్ జలోట వద్ద పని చేసిన మోడల్ అనీషా సింగ్ తాజాగా ఇండియా‌స్కూప్స్ అనే వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో…. జస్లీన్ అతడి వల్ల గతేడాది గర్భం దాల్చింది. ఆ తర్వాత ఆమెకు అబార్షన్ చేయించారు అని ఆరోపించారు.
అతడి నిర్లక్ష్యం వల్లే ఓసారి ఇద్దరూ గొడవ పడ్డారు. అనూప్ జలోటా నిర్లక్ష్యం వల్లనే ప్రెగ్నెన్సీ వచ్చిందని జస్లీన్ తెలిపింది. అయితే ఈ విషయాన్ని జలోటా తీవ్రంగా ఖండించారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఓసారి జలోటా నన్ను పిలిచి నా మూడ్ బాగోలేదు, రెండు మూడు రోజుల తర్వాత వచ్చి కలవు అన్నాడు. తర్వాత నాకు జస్లీన్‌కు అబార్షన్ చేయించారనే విషయం తెలిసిదని అనీషా సింగ్ తెలిపారు.
ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుమానించేవాడు ఒకరోజు గడిచిన తర్వాత జలోటా నన్ను పిలిచి… జస్లీన్ తనను మోసం చేస్తోందని, ఆమెకు యూకెలో సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాడు. ఆ సమయంలో జలోటా నాకు అన్ని విషయాలు చెప్పేవాడు. జస్లీన్‌తో రిలేషన్ షిప్ గురించి కూడా మాట్లాడేవాడు…. అని అనీషా సింగ్ గుర్తు చేసుకున్నారు.
ఎవరికీ తెలియకుండా రహస్యంగా  అనూప్, జస్లీన్ దాదాపు మూడున్నర సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా తమ రిలేషన్ షిప్ కొనసాగించారు. చివరకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలియదు. వారి సీక్రెట్ లవ్ అఫైర్ గురించి బిగ్ బాస్ 12 గ్రాండ్ ప్రీమియర్ సమయంలోనే అందరికీ తెలిసింది.
జస్లీన్ రిలేషన్‌పై తండ్రి ఆగ్రహం అనూప్ జలోటా, జస్లీన్ రిలేషన్ షిప్ గురించి తెలిసి…. జస్లీన్ కుటుంబ సభ్యులు షాకయ్యారు. జస్లీన్ తండ్రి కేసర్ మాథరు ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ…వీరి రిలేషన్ షిప్ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. వారికి వీలైనంత దూరంగా ఉంటాను. నా కూతురు వచ్చిన తర్వాత ఎందుకు ఇలా చేశావని అడుగుతాను అన్నారు.