జాతీయం

శ్రీవారికి రూ.3 కోట్ల విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి బుధవారం రూ.3 కోట్ల విరాళం వచ్చింది. చెన్నైకి చెందిన వి.శ్రీనివాసులు, శాంతి దంపతులు రూ.2 కోట్ల విరాళాన్ని శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు అందజేశారు. జెమ్లీ ఐటీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.కోటి విరాళాన్ని ప్రాణదానం ట్రస్టుకు ఇచ్చింది. విరాళాలకు సంబంధించిన డీడీలను తిరుమల దాతల విభాగం డిప్యూటీ ఈవో లక్ష్మణ్‌ నాయక్‌ స్వీకరించారు.