తెలంగాణ

వైసీపీ గెలుపు.. కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎన్నికల్లో విజయం సాధించినందుకు వైఎస్‌ జగన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు పడిన కష్టానికి ప్రజల ఆశీర్వాదం రూపంలో మంచి ఫలితం దక్కింది. తెలంగాణకు సోదరిలాంటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మీరు చక్కగా పాలిస్తారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. టీడీపీ ఆధిక్యం 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. రాష్ట్రంలో వైసీపీ హవా కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను పలువురు నేతలు కలిసి అభినందనలు చెబుతున్నారు. అటు లోక్‌సభ ఎన్నికల్లోనూ వైసీపీ దూసుకుపోతోంది.