ఆంధ్రప్రదేశ్క్రైమ్తెలంగాణ

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం..

ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ జనం గుండె చప్పుడు తెలుసుకుంటున్న జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడం తీవ్ర సంచలనం రేపుతోంది. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి ఓ దుండగుడు వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. అత్యంత భద్రత ఉండే ఎయిర్‌పోర్ట్‌లో సాక్షాత్తూ రాష్ట్ర ప్రతిపక్ష నేతపై ఇలా హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి..

  • శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. పెద్ద ఎత్తున చేరుకున్న తెలంగాణ వైఎస్సార్సీపీ శ్రేణులు.. తమ అధినేతపై హత్యాయత్నం నేపథ్యంలో ఎయిర్‌పోర్టు వద్ద పార్టీ శ్రేణుల ఆందోళన

సురేశ్‌ ప్రభు దిగ్భ్రాంతి…

  • ఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి పట్ల పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది పిరికిపంద చర్య అని ఆయన అభివర్ణించారు. సీఐఎస్ఎఫ్ సహా అన్ని సంస్థలను ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ట్విట్టర్‌లో ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ మొదలుపెట్టామని, దీనికి బాధ్యులెవరో గుర్తించాలని పౌర విమానయాన శాఖ కార్యదర్శిని ఆదేశించామని తెలిపారు.

ఏపీ డీజీపీకి గవర్నర్‌ నరసింహన్‌ ఫోన్‌ 

  •  వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ఏపీ డీజీపీకి గవర్నర్‌ నరసింహన్‌ ఫోన్‌ చేశారు. హత్యాయత్నంపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని డీజీపీని గవర్నర్‌ ఆదేశించారు. ఈ క్రమంలో ఏపీ డీజీపీ ఆఫీస్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు బయల్దేరి వెళ్లారు.
    జగన్‌పై హత్యాయత్నాన్ని ఖండించిన బీజేపీ
  • ఇటువంటి దాడులు దారుణం. ఇలాంటివాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కోళ్ల పందాలకు వాడే కత్తి పదును తీవ్రంగా ఉంటుంది. కుట్రపూరితంగా జరిగిందేమోనని అనుమానం కలుగుతోంది:  సోము వీర్రాజుజగన్‌పై హత్యాయత్నాన్ని ఖండించిన జీవీఎల్‌
  • సురక్షితంగా భావించే ఎయిర్‌పోర్ట్‌లో ఇటువంటి దాడులు జరగడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు.


వైఎస్సార్సీపీ శ్రేణుల దిగ్భ్రాంతి

  • తమ అభిమాన వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరగడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని విశాఖ ఎయిర్‌పోర్ట్‌ ముందు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి ఎలా వెళ్లిందని, తనిఖీ చేయకుండా ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది దుండగుడిని ఎలా లోపలికి పంపించారని వారు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన దుండగుడు అక్కడి రెస్టారెంట్‌లో పనిచేస్తుండగా.. ఆ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్దన్‌ అని, అతను గతంలో గాజువాక నుంచి టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నించారని తెలుస్తోంది.

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం

  • వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌పై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. ప్రజాసంకల్పయాత్ర పూర్తిచేసుకుని హైదరాబాద్‌కు చేరుకునేందుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఆయన ఎదురుచూస్తుండగా దాడి జరిగింది. అక్కడి రెస్టారెంట్‌లో పనిచేసే వెయిటర్‌ శ్రీనివాస్‌ సెల్ఫీ నెపంతో వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చి.. కత్తితో మెడపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వైఎస్‌ జగన్‌ తప్పించుకోవడంతో ఆయన భుజానికి తీవ్రగాయమైంది. కోడిపందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడని, ఉద్దేశపూర్వకంగానే ఈ హత్యాయత్నం జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.