ఆంధ్రప్రదేశ్

వైఎస్సార్‌ పింఛను కానుక పంపిణీ

వైఎస్సార్‌ పింఛను కానుక పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ఆటోనగర్ లో ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి  వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెంచిన పింఛను పంపిణీని స్థానిక ఆటోనగర్లో తిరుపతి నగరపలక సంస్థ కమిషనరు శ్రీ పి.ఎస్. గిరీష, తిరుపతి ఎంఎల్ఎ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి  చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా కమిషనరు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెన్షన్ రూ.2000 నుండి రూ.2250లకు పెంచడం జరిగిందని, ఈ పెరిగిన మొత్తాన్ని తమ సిబ్బంది ప్రతీనెల 4వతేదీలోపు పంపిణీ చేస్తారని తెలిపారు. వేలిముద్రలు పడని పెన్షన్ దారులకు 5వ తేదీన ఇస్తారని ఆయన తెలిపారు. పెన్షన్ తీసుకోవడానికి రాలేని వారికి నేరుగా తమ సిబ్బంది ఇంటికే వచ్చి ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎవరికైన సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత ప్రభుత్వంలా మాటలు చెప్పేది కాదని, చెప్పిన విధంగానే పెన్షన్ రూ.2000 నుండి 3000లకు దశలవారీగా పెంచడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా వృద్ధాప్య పెన్షన్ 65 సం. నుండి 60 సం. వయసుకు తగ్గించామని, వికలాంగుల శాతంతో పనిలేకుండా అందరికి రూ.3000, డయాలసిస్ పేషెంట్‌కు 10,000/- రూ.లకు పెంచామన్నారు. ప్రజలందరూ తమ ప్రభుత్వానికి ఎప్పుడూ అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనరు ఎంవిడి ఫణిరాం, మెప్మా సూపరింటెండెంట్ గాలి సుధాకర్, వార్డు సభ్యులు, పింఛనుదారులు పాల్గొన్నారు.