ఆంధ్రప్రదేశ్

విశాఖ, తూర్పుగోదావరి సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

సీలేరు,(విశాఖపట్నం): ఏపీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకొన్నాయి. ముందస్తు సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన విశాఖ, తూర్పుగోదావరి సరిహద్దుల్లోని చొప్పకొండ, బురద కోట అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటుచేసుకొంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య సుమారు 48 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని తనిఖీ చేయగా మూడు 303 తుపాకులు, ఆరు కిట్‌బ్యాగులను దొరికాయి. తప్పించుకున్న మావోయిస్టులు కోసం గాలింపు చేపట్టారు.