ఆంధ్రప్రదేశ్

వివేకా హత్య కేసులో రిమాండ్‌ పొడిగింపు

కడప: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరో 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది. తొలుత విధించిన కస్టడీ ముగిసిన అనంతరం నిందితులను సోమవారం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్‌కు తొలుత 12 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఆ గడువు సోమవారంతో పూర్తి కాగా.. మరో 14 రోజుల పాటు రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది.