సినిమా

విదేశాల్లో ‘సైరా’ వార్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫిల్మ్ ‘సైరా నరసింహారెడ్డి’. ఇటీవల రిలీజైన టీజర్‌తో అంచనాలు భారీగానే పెరిగాయి. కొద్దిరోజుల కిందట హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. ఐతే, షూట్ చేసిన ఫైట్ సీన్స్ అనుకున్నంత బాగా రాకపోవడంతో విదేశాల్లో రీషూట్‌కి ప్లాన్ చేస్తోంది యూనిట్. బ్రిటీషర్లతో వార్ సీన్స్ ఫారెన్‌లో తెరకెక్కిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే చాలా లొకేషన్స్ ఎంపిక చేసినట్లు ఇన్‌సైడ్ సమాచారం.తొలుత మొరాకో వెళ్లాలని భావించినా ఖర్చుతో కూడుకున్నది కావడంతో డ్రాపైంది. ఈసారి జార్జియాపై కన్నేసింది. అక్కడ కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి తెలుగు చిత్రాలను తెరకెక్కించడంతో అటువైపే మొగ్గుచూపినట్టు మెగా క్యాంప్ నుంచి బలంగా వినిపిస్తున్నమాట. విశాలమైన ప్రాంతం, అందమైన లొకేషన్లకు జార్జియా పెట్టింది పేరు. మొత్తమ్మీద 20 రోజులపాటు అక్కడ చిత్రీకరణ జరగనుంది. ఇప్పటికే తమన్నా, సుదీప్, జగపతిబాబు, అమితాబ్ వంటి నటులు తమ షూట్‌ని ఫినిష్ చేసుకున్నారు. జార్జియా నుంచి వచ్చిన తర్వాత రిలీజ్ ఎప్పుడన్న  క్లారిటీ రావచ్చని అంటున్నారు.