ఆంధ్రప్రదేశ్

విజయ సాయి రెడ్డి : అన్న క్యాంటీన్లలో రూ.150 కోట్ల స్కామ్‌…..!

అమరావతి : ఏపీ రాష్ట్రంలోని నిరుపేదలకు అతి తక్కువ ధరలకే నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందజేసేందుకు గత ప్రభుత్వం నెలకొల్పిన అన్న క్యాంటీన్లు అర్థాంతరంగా మూతబడ్డ సంగతి తెలిసిందే. రోజూ మాదిరిగానే ఈ ఫలహారశాలలకు వెళ్లిన అన్నార్తులకు అవన్నీ తాళాలు వేసి కనిపించాయి. దీంతో సర్కార్ పై ప్రతిపక్ష పార్టీల నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మీడియాలో.. సోషల్ మీడియాలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కాగా, ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో 150 కోట్ల స్కాం జరిగిందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్ వేదికగా తెలిపారు. పేదలకు తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారని పేర్కొన్నారు.