అంతర్జాతీయం

విజయ్ దివస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి : రామ్‌నాథ్‌ కోవింద్‌

శ్రీనగర్ : దేశ రక్షణ కోసం శౌర్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించిన వీరులందరికీ వందనాలు అని అన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించి నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన అమరజవాన్లకు నివాళులర్పించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ ద్రాస్‌కు వెళ్లాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీనగర్‌ ఉండి.. అక్కడి బదామీ బాగ్ కంటోన్మెంట్‌లో వీరజవాన్లకు నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్న కోవింద్‌.. భారత సేనల అసమాన వీరత్వాన్ని గుర్తుచేసుకోవాల్సిన రోజు ఈ రోజు అని అన్నారు.