ఆంధ్రప్రదేశ్

విజయం ముందే ఊహించాం: జగన్‌

సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని ముందుగానే ఊహించామని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్న జగన్‌.. జాతీయ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ గురించి ఇప్పుడే ఏం మాట్లాడనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. 150 అసెంబ్లీ స్థానాల్లో, 24 ఎంపీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరో వైపు జగన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు వైకాపా శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలతో తాడేపల్లిలో సందడి నెలకొంది.