క్రీడలు

విండీస్‌ వైస్‌ కెప్టెన్‌గా క్రిస్‌గేల్‌

లండన్‌: వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ను విండీస్‌ క్రికెట్‌ బోర్డు నియమించింది. జమైకా క్రికెటర్‌ చివరి సారిగా 2010 జూన్‌లో విండీస్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. జట్టులో తనకు కీలక బాధ్యతలు అప్పగించడంపై గేల్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

ఏ ఫార్మాట్లోనైనా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తాను. వరల్డ్‌ కప్‌ టోర్నీ తనకు ఎంతో ప్రత్యేకమైనది. ఒక సీనియర్‌ ప్లేయర్‌గా కెప్టెన్‌తో పాటు సహచర ఆటగాళ్లకు సహకారం, మద్దతుగా నిలవడనం నా బాధ్యత. అతిపెద్ద ప్రపంచకప్‌ టోర్నీలో అంచనాలు భారీగానే ఉంటాయి. వెస్టిండీస్‌ ప్రజల కోసం మేమంతా అత్యుత్తమ ప్రదర్శన చేస్తామని నాకు తెలుసు. అని గేల్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ఆడిన గేల్‌ ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు.