జాతీయం

వారణాసిలో మోదీ విజయం

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బిజెపినేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో భాజపా ఆధిక్యంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విజయం సాధించారు. సమీప ఎస్పీ అభ్యర్థి షాలిని యాదవ్‌పై 4లక్షలకు పైగా మెజార్టీతో మోదీ జయభేరీ మోగించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ తొలిసారిగా వారణాసి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచి పోటీచేసి విజయం సాధించారు. కాగా.. ఈ నెల 26న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో భాజపా ప్రభంజనంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌ కలిస్తే విజయీ భారత్‌ అని మోదీ ట్విటర్‌ ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు.