జాతీయం

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 64 పాయింట్ల లాభంతో 37,179 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,187 వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా రంగ దిగ్గజం లూపిన్‌ షేర్లు 4శాతం కుంగాయి. చైనాకు టెలికాం దిగ్గజం హువాయిపై అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధంచడంతో వాణిజ్య యుద్ధం మరో అడుగు ముందుకుపడినట్లైంది. మరోపక్క ఇరాన్‌లో సంక్షోభం ముదరడంతో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.7శాతం పెరిగి 72.25 డాలర్లకు చేరింది. రూపాయి విలువ స్వల్పంగా పెరిగి 70.34 డాలర్లు వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.