అంతర్జాతీయం

రోహిత్‌కు జరిమానా

మొహాలి: ముంబయి ఇండియన్స్‌- కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే.
కేఎల్‌  రాహుల్‌ (71 నాటౌట్‌; 57 బంతుల్లో 6×4, 1×6) విధ్వంసకర బ్యాటింగ్‌కు  క్రిస్‌ గేల్‌ (40; 24 బంతుల్లో 3×4, 4×6) తోడవ్వడంతో పంజాబ్‌ జట్టు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.అయితే ముంబయి ఇండియన్స్‌కు పరాజయంతో పాటు జరిమానా కూడా పడింది. ఆ జట్టు సారథి రోహిత్‌ శర్మకు యాజమాన్యం రూ.12లక్షల జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఫైన్‌ పడింది. ఈ సీజన్‌లో ఒక జట్టుకు జరిమానా పడటం ఇదే తొలిసారి.