తెలంగాణ

రైల్వేప్రయాణికులు ఇక సినిమాలు చూడొచ్చు..

  • కాచిగూడ రైల్వేస్టేషనులో మొబైల్‌ థియేటర్‌ ప్రారంభం
హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషనుకు వచ్చే ప్రయాణికులకు శుభవార్త. రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణికుల కోసం కాచిగూడ రైల్వేస్టేషను వద్ద రైల్వే అధికారులు తాత్కాలిక మినీ ఏసీ థియేటర్‌ను డీఆర్‌ఎం అరుణ్‌కుమార్‌ జైన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ మినీ ఏసీ థియేటర్‌ మూడు నెలల పా టు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రైల్వే ప్రయాణికులకు వినోదాన్ని కల్పించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాత్కాలికంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ థియేటర్‌లో నామమాత్రపు రేటుతో ప్రయాణికులు సినిమాలను చూడొచ్చు. గతంలో ఏర్పాటు చేసిన మినీ ఏసీ థియేటర్‌లో సినిమాలు ఉచితంగా తిలకించారు. ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం వలన నామమాత్రపు రేటుతో సినిమా తిలకించే అవకాశాన్ని కల్పించారు. 120 మంది ప్రయాణికులు కూర్చునే అవకాశం ఉంది. మూడు నెలల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ థియేటర్‌లో హిందీ, తెలుగు సినిమాలను ప్రదర్శిస్తారు. స్వచ్ఛరైల్వే, రైల్వే భద్రత తదితర అంశాలతో పాటు సినిమాలను ప్రదర్శిస్తారు.