ఆంధ్రప్రదేశ్క్రైమ్

రైలు కిందపడి తల్లి, ఇద్దరి కూతుళ్ల ఆత్మహత్య

గరివిడి: కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరి కూతుళ్లతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం జిల్లా గరివిడి మండల పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని కొండ లక్ష్మీపురం గ్రామానికి చెందిన సాకేటి అంజలి(28) తన ఇద్దరు కూమార్తెలు మణి(7), జ్యోత్య్స (6)లతో గురువారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.