అంతర్జాతీయం

రైట‌ర్స్ జ‌ర్న‌లిస్టుల‌కు క్ష‌మాభిక్ష‌..

హైద‌రాబాద్‌: రైట‌ర్స్ వార్తా సంస్థ‌కు చెందిన ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టుల‌ను మ‌య‌న్మార్ ఇటీవ‌ల అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఇద్ద‌ర్నీ ఇవాళ రిలీజ్ చేశారు. దేశాధ్య‌క్షుడు క్ష‌మించ‌డంతో.. జ‌ర్న‌లిస్టు వా లోన్‌, క్వా సో ఊల‌ను విడుద‌ల చేశారు. అఫిషియ‌ల్ సీక్రెట్స్ చ‌ట్టాన్ని ఆ ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టులు ఉల్లంఘించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో మ‌య‌న్మార్ కోర్టు ఆ ఇద్ద‌రికీ ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. 2017లో జ‌రిగిన ఓ మిలిట‌రీ ఆప‌రేష‌న్‌లో.. భ‌ద్ర‌తా ద‌ళాలు ప‌ది మంది రోహింగ్యా ముస్లింల‌ను హ‌త‌మార్చిన‌ట్లు రైట‌ర్స్ రిపోర్ట‌ర్లు క‌థ‌నం రాశారు. జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్టు చేయ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు గ‌ళ‌మెత్తాయి. ప‌త్రికా స్వేచ్ఛ‌కు సంకెళ్లు వేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే మ‌య‌న్మార్ కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా.. దేశ‌వ్యాప్తంగా అనేక మంది ఖైదీల‌ను రిలీజ్ చేస్తారు. దాంట్లో భాగంగానే ఇవాళ రైట‌ర్స్ రిపోర్ట‌ర్ల‌ను కూడా రిలీజ్ చేశారు.