సినిమా

రివ్యూ: ప్రేమకథా చిత్రమ్‌ 2

చిత్రం: ప్రేమకథా చిత్రమ్‌2
నటీనటులు: సుమంత్‌ అశ్విన్‌, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ, ప్రభాస్‌ శ్రీను, విద్యుల్లేఖ రామన్‌ తదితరులు
సంగీతం: జీవన్‌ బాబు
సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ ప్రసాద్‌
ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్ధవ్‌
నిర్మాత: ఆర్‌ సుదర్శన్‌రెడ్డి
దర్శకత్వం: హరి కిషన్‌
బ్యానర్‌: ఆర్‌పీఏ క్రియేషన్స్‌
విడుదల తేదీ: 06-04-2019
హారర్‌ కామెడీ జోనర్‌ చిత్రాలలో కొత్త ట్రెండ్‌ సృష్టించింది… ‘ప్రేమకథా చిత్రమ్’‌. ఆ సినిమా తర్వాత ఇదే జోనర్‌లో చాలా కథలొచ్చాయి. వెళ్లాయి. నూటికి ఒకటో, రెండో ప్రేక్షకుల మెప్పుని పొందగలిగాయి. మిగిలినవన్నీ… వృథా ప్రయాసలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు ‘ప్రేమ కథా చిత్రమ్‌’కి కొనసాగింపుగా పార్ట్‌ 2 వచ్చింది. మరి… తొలి సినిమా ఫలితాన్ని సీక్వెల్‌ అందుకోగలిగిందా, లేదా? అప్పటి వినోదం… ఇప్పుడూ కనిపించిందా? భయ పెట్టిన అంశాలేంటి?