అంతర్జాతీయం

రాహుల్ సభలో రచ్చ రచ్చ

మాల్దా(పశ్చిమబెంగాల్‌): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. సభా ప్రాంగణంలో సరైన సదుపాయాలు కల్పించలేదంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు విసురుతూ, బారికేడ్లు విరగ్గొడుతూ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

ఎన్నికల ప్రచారం నిమిత్తం రాహుల్‌ నేడు పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాల్దాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాహుల్‌ సభా వేదిక వద్దకు వచ్చారు.  అంతకంటే ముందే భారీ ఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి రావడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో సభా ప్రాంగణంలో కూర్చునేందుకు సరైన ఏర్పాట్లు చేయలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. పార్టీ రాష్ట్ర నేతలు వారించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు సరికదా.. కుర్చీలను వీఐపీ జోన్‌లోకి విసిరికొట్టారు. బారికేడ్లను పగలగొట్టి రచ్చరచ్చ చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది.