politicalజాతీయం

రాష్ట్ర విభజనతో గాయపడిన ఏపీ

గత ప్రభుత్వం జరిగిన అవకతవకలపై స్పష్టమైన నివేదికను.. రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తేనే స్పందిస్తామని కేంద్రప్రభుత్వం పేర్కొందని రాజమండ్రి ఎంపి భరత్‌ స్పష్టం చేశారు. మెజారిటీ ప్రజల అభిప్రాయంతో పని లేకుండా జరిగిన రాష్ట్ర విభజనతో ఏపీ గాయపడిన రాష్ట్రంగా తయారయ్యిందన్నారు. అందులో భాగంగానే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ..అమలు చేయాలని ఎంపీ భరత్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా..ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రప్రయోజనాలే లక్ష్యంగా..తమ పార్టీలోని 22 మంది ఎంపీలతో పాటు..ఇద్దరు రాజ్యసభ సభ్యులు చిత్తశుద్ధితో పోరాడుతున్నారని ఎంపీ ఉద్ఘాటించారు.