తెలంగాణ

రామకృష్ణాపురంలో మొక్కల పంపిణీ

హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ప్రతి ఇంటికీ కనీసం ఐదు మొక్కలు పెంచేలా ఏర్పాటు చేసుకోవాలని సర్పంచి కుటుంబరావు గ్రామస్థులకు సూచించారు. పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ ఏర్పాటు చేసి మొక్కల పంపిణీని చేపట్టారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి సురేశ్‌, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.