ఆంధ్రప్రదేశ్

రానున్న 24గంటల్లో ఏపీలో ఉరుములతో కూడిన వర్షాలు..

అమరావతి: రానున్న 24గంటల్లో రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం దక్షిణ అండమాన్ సముద్రంలో వచ్చిన ఆవర్తనంతో సోమవారం దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆవర్తనం మూడు రోజుల్లో బయపడి వాయుగుండంగా మారి ఉత్తరకోస్తా, ఒడిశా దిశగా పయనిస్తుందని తెలిపారు. మరోవైపు నైరుతి ఉపసంహరణతో మచిలీపట్నం, కర్నూలు నుంచి రుతు పవనాలు నిష్ర్రమించినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సోమవారం నాటికి ఇవి దక్షిణాది నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయని, ఆ తరువాత ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు.