క్రైమ్

యూపీలో కాల్పుల కలకలం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో భూవివాదం కాల్పులకు దారితీసింది. ఘజియాబాద్‌లో నడిరోడ్డుపైనే రెండు వర్గాలకు చెందిన వారు తుపాకులతో కాల్పులకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పుల ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వాహబ్‌చౌదరి అనుచరులు మరో వర్గంపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాహబ్‌ సోదరుడిని నుంచి పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. త్వరలోనే మరో నిందితుడ్ని పట్టుకుంటామని తెలిపారు.