ఆంధ్రప్రదేశ్క్రైమ్

యువతి ఇంటిముందు మృతదేహంతో ఆందోళన

ఒంగోలు నేరవిభాగం: యువకుడి అనుమానాస్పద మృతితో ఆయన కుటుంబీకులు ఓ యువతి ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిరుపతికి చెందిన అవినాశ్‌రెడ్డి అనే యువకుడు శనివారం ఒంగోలు గోపాల్‌నగర్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆ యువకుడు పురుగులు మందు తాగి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారమందింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఒంగోలు చేరుకున్నారు. అవినాశ్‌రెడ్డి గోపాల్‌నగర్‌కు చెందిన ఓ యువతిని ప్రేమించాడని.. ఆమె కోసం ఒంగోలు రాగా యువతి బంధువులే కొట్టి చంపారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. యువకుడి మృతదేహంతో యువతి ఇంటిముందు ఆందోళన చేపట్టారు. అవినాశ్‌ మృతదేహంపై గాయాలున్నాయని, దీనిపై విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అనినాశ్‌ కుటుంబసభ్యుల ఆరోపణల నేపథ్యంతో సదరు యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.