జాతీయం

మైండ్‌ట్రీ డీల్‌కు సీసీఐ అనుమతి..!

ముంబయి: మైండ్‌ట్రీలో వాటాల కొనుగోలుకు ది కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఎల్‌అండ్‌టీకి అనుమతి మంజూరు చేసింది. ఈ డీల్‌ కింద మైండ్‌ట్రీలో 66.15శాతం వాటాలను ఎల్‌అండ్‌టీ కొనుగోలు చేయనుంది. సీసీఐ అనుమతులతో ఎల్‌అండ్‌టీ ఒక పెద్ద ముందడుగు వేసినట్లైంది. న్యాయనిపుణుల విశ్లేషణ ప్రకారం మరికొన్ని కీలక అనుమతులు రావాల్సి ఉంది.
విదేశీ చట్టాల కింద ఉన్న యాంటీ ట్రస్ట్‌ అథారిటీల అనుమతులు కూడా దీనికి అవసరం. వీటిల్లో మైండ్‌ట్రీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా, జర్మనీల నుంచి కూడా అనుమతులు రావాల్సి ఉంది. సీసీఐ అనుమతి కనుక లభించకపోతే ఎల్‌అండ్‌టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలేది. కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ వద్ద నుంచి మైండ్‌ట్రీలో 20.32శాతం వాటాలను కొనుగోలు చేయడంతో ఎల్‌అండ్‌టీ టేకోవర్‌కు బిడ్‌ వేసినట్లైంది. మిగిలిన 15శాతం వాటాలను ఓపెన్‌ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసేందుకు ఎల్‌అండ్‌టీ సిద్ధమైంది.