తెలంగాణ

మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రజలకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని కార్మికులందరూ సుఖసంతోషాలతో జీవించాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న కార్మిక లోకానికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.