క్రైమ్తెలంగాణ

మూడు కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం

సుల్తాన్‌బజార్‌: వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సుల్తాన్‌బజార్‌ పోలీసులు మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ చౌరస్తా వద్ద డీఐ లక్ష్మణ్‌ బుధవారం ఉదయం 6.30 గంటలకు వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో సుల్తాన్‌బజార్‌ నుంచి కాచిగూడ చౌరస్తా వైపునకు ద్విచక్రవాహనం (ఏపీ07సీపీ-4165) పై వచ్చిన అనంతపురానికి చెందిన ఎం.బద్రీనాథ్‌ (36) వాహనం తనిఖీ చేయగా అందులోంచి వందగ్రాముల్లో ఉన్న 30 బంగారు బిస్కెట్లు (సుమారు మూడు కిలోలు) లభ్యమైంది. బంగారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు, బిల్లులు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.