జాతీయం

మిజోరం, మధ్యప్రదేశ్‌లలో కొనసాగుతున్న పోలింగ్‌

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు పలు ప్రాంతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో భాగంగా బుధవారం మధ్యప్రదేశ్‌, మిజోరంలలో పోలింగ్‌ జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు గాను 2,899 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 65 వేల పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

మరోవైపు మిజోరంలోని 40 స్థానాలకు 209 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 1,164 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 11న జరగనుంది.