జాతీయం

మావోల దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ

హైదరాబాద్‌ : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో పోలీసులు వెళ్తున్న వాహనాన్ని ఐఈడీతో మావోయిస్టులు పేల్చిన సంగతి తెలిసిందే. దీంతో 15 మంది పోలీసులు, ఒక డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పోలీసుల ధైర్యసాహసాలకు తాను సెల్యూట్‌ చేస్తున్నాను. వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోదు అని మోదీ పేర్కొన్నారు. పోలీసు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. హింసాత్మక ఘటనలను ఉపేక్షించేది లేదని మోదీ స్పష్టం చేశారు.

పోలీసుల వాహనంపై మావోయిస్టులు దాడి చేయడాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై డీజీపీ, గడ్చిరోలి ఎస్పీతో మాట్లాడానని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.