ఆంధ్రప్రదేశ్

మార్కెట్‌లోకి జీప్‌ కంపాస్‌ స్పోర్ట్స్‌ ప్లస్‌

ముంబయి: మార్కెట్లోకి జీప్‌ కంపాస్‌ స్పోర్ట్స్‌ ప్లస్‌ విడుదలైంది. దీని ధర రూ.15.99 లక్షలుగా(ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. దీనిలోని సరికొత్త ఫీచర్లను అన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చారు. 16 అంగుళాల స్పోర్ట్స్‌ అలాయ్‌ వీల్స్‌, డ్యూయల్‌జోన్‌ ఆటో ఎయిర్‌ కండీషన్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్‌, బ్లాక్‌ రూఫ్ రైల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. మిగిలిన 21 ఫీచర్లకు అదనంగా వీటిని అందిస్తున్నారు. ఈ కారులో ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, నాలుగు చక్రాలకు డిస్క్‌ బ్రేకులు అందుబాటులో ఉన్నాయి.

ఇది రెండు రకాల ఇంజిన్లలో లభిస్తోంది. 2.0 మల్టీజెట్‌ ఇంజిన్‌, 6స్పీడ్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌లలో లభిస్తుంది. మరో వేరియంట్‌లో 1.4లీటర్‌ మల్టీఎయిర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 6స్పీడ్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది. ‘‘కొత్త జీప్‌ కంపాస్‌ స్పోర్ట్స్‌ ప్లస్‌లో అన్ని రకాల అదనపు హంగులు ఉన్నాయి. మంచి ధరకు జీప్‌లో అన్ని రకాల అదనపు హంగులు లభిస్తున్నాయి. ఊహించని చాలా ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చాము.’’ అని ఎఫ్‌సీఏ ఇండియా అధ్యక్షుడు, ఎండీ కెవిన్‌ ఫ్లయన్‌ పేర్కొన్నారు.