క్రైమ్

మహిళను కడుపులో తన్ని..!

అసలే పొలిటీషియన్.. ఆపై మదమెక్కింది.. ఇక విచక్షణ ఎక్కడుంటుంది? డీఎంకే నాయకుడు పాల్పడ్డ ఒక దాష్టీకం ఇప్పుడు తమిళనాడుతో పాటు దేశమంతా పాకిపోయింది. తమిళనాట పెరంబలూరులోని ఒక బ్యూటీపార్లర్..! నలుగురు మహిళలు డ్యూటీలో వున్నారు. డీఎంకే పార్టీకి చెందిన స్థానిక కార్పొరేటర్ సెల్వకుమార్.. అక్కడున్న ఒక మహిళ మీద రంకెలేశాడు. అంతటితో ఆగకుండా ఆమెను దూషిస్తూ ముందూ వెనుకా కాలితో విచ్చలవిడిగా తన్నడం మొదలుపెట్టాడు. మిగతా ముగ్గురూ వద్దని వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయాడు. మే నెల 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బైటికొచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పెరంబలూర్ పోలీసులు శ్రీమాన్ సెల్వకుమార్‌ని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. వెంటనే తేరుకున్న డీఎంకే పార్టీ పెద్దలు కూడా అతగాడి ప్రాధమిక సభ్యత్వాన్ని ఊడబీకి చేతులు కడుక్కున్నారు.

Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
Latest Posts