ఆంధ్రప్రదేశ్

మరో రికార్డుకు సిద్ధమైన పోలవరం..

మరో అరుదైన ఘనత సాధించడానికి పోలవరం సిద్ధమైంది. 24 గంటల్లో 28-30 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 24 మంది నిపుణులు, 3 వేల మంది ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులకు పూనుకుంది. ప్రాజెక్టు స్పిల్‌ వే, స్పిల్‌ చానల్లో పనులు ప్రారంభించారు. రేపు ఉదయం 8 గంటల వరకు కాంక్రీట్‌ పనులు పూర్తి చేసి… గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ రికార్డుల్లో స్థానం కోసం ఏపీ సర్కార్‌ ప్రయత్నిస్తోంది.