జాతీయం

మరికొన్ని సర్వీసులు నిలిపేసిన జెట్‌

ముంబయి: ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ మరికొన్ని కీలక అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. వీటిల్లో తూర్పు ఆసియా దేశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను సోమవారం వరకు రద్దు చేసింది.  తాజాగా సార్క్‌, ఏసియన్‌ దేశాలకు వెళ్లే సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్‌ను నిలిపివేసినట్లు ఏవియేషన్‌ రెగ్యులేటరీకి సమాచారం అందజేసింది. వీటిల్లో కొలంబో, కాఠ్‌మాండూ, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌లు ఉన్నాయి. వీటి ముందస్తు బుకింగ్స్‌ను ఎప్పుడు పునరుద్ధరిస్తారో మాత్రం ఇంకా వెల్లడికాలేదు.
వేసవి సీజన్‌ కావడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ లండన్‌ సర్వీసులను ఏప్రిల్‌ 15 నుంచి పునరుద్ధరించాలని భావిస్తోంది. దీంతోపాటు యూరప్‌లోని పారిస్‌, ఆమ్‌స్టర్‌డామ్‌ మార్గాలకు మళ్లీ విమానాలను నడిపే అవకాశం ఉంది.