జాతీయం

మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప!

అసోంలో మత్స్యకారులకు వలకు భారీ చేప చిక్కింది. అంతపెద్ద చేప తమకెప్పుడూ లభించలేదని మత్స్యకారులు చెబుతున్నారు. దీని బరువు సుమారు 15 కేజీలు ఉంటుందని తెలిపారు. అయితే, అది క్యాట్‌ఫిష్‌ అని.. దాన్ని తినకూడదని కొందరు అంటుంటే.. మంచినీటిలో పెరిగిన ఈ చేపను తింటే ఏ సమస్యా ఉండదని మత్స్యకారులు చెబుతున్నారు.