జాతీయం

మణిరత్నం ఆరోగ్యం.. ఆ వార్తల్లో నిజం లేదు

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మద్దని ఆయన సన్నిహితులు ఓ ప్రకటన విడుదల చేశారు. గుండె నొప్పి కారణంగా ఆయన చెన్నైలోని అపోలోలో చేరారని వస్తున్న వార్తలను వారు ఖండించారు. ఆయన సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారని తెలిపారు. సోమవారం ఉదయాన్నే ఆయన తన కార్యాలయానికి వెళ్లారని పేర్కొన్నారు. గతంలోనూ మణిరత్నం ఆరోగ్యంపై ఇలాంటి వదంతులే వచ్చాయి. ఆయనకు గుండె నొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది నిజం కాదని తేలింది.

మణిరత్నంకు తొలిసారిగా 2004లో ‘యువ’ చిత్రం సెట్స్ పై ఒత్తిడికిలోనై స్ట్రోక్ వచ్చింది. మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత 2015లో ఓకే కన్మణి(తెలుగులో ఓకే బంగారం) షూటింగ్ సమయంలో వచ్చింది. 2018లో  మరోసారి అదే సమస్య వచ్చింది. ఇప్పుడు ఆయన ఆసుపత్రికి వెళ్లడంతో వదంతులు మొదలయ్యాయి.