జాతీయంవ్యాపారం

మందకొడిగా స్టాక్‌ మార్కెట్లు..!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం మందకొడిగా ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.43 సమయంలో సెన్సెక్స్‌ 5 పాయింట్ల నష్టంతో 39,026 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 11,742 వద్ద ట్రేడవుతున్నాయి. చమురు ధరలు పెరగనున్నాయనే వార్తలు, త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉండటంతో మార్కెట్లు ఆచితూచి ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్‌ షేర్లు సూచీల పతనానికి కారణమయ్యాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ షేర్లు భారీగా పతనమయ్యాయి. మరోపక్క జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎస్కార్ట్స్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి భారీ షేర్లు కూడా నష్టాల బాటలో ఉండటంతో సూచీలు కుంగాయి.
నేటి నుంచి ఆంక్షలు అమల్లోకి..
ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లపై నేటి నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో చమురు ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. దీంతోపాటు అమెరికా మిత్ర దేశాల్లో కూడా చమురు ఉత్పత్తిని పెంచాయి. దీంతో ముడి చమురు ధర పతనమైంది.