అంతర్జాతీయం

భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: కేంద్ర బడ్జెట్‌లో కీలక అంశాలు వెలువడిన వేళ దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. మధ్యాహ్నం 1.30 సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 448 పాయింట్లు నష్టపోయి 39,459 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో 11,802 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.68.47గా ఉంది.

845 కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరో 1298 కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు 119 కంపెనీల షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్ టెల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ లిమిటెడ్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. యస్‌ బ్యాంకు, ఓఎన్జీసీ, ఎన్‌టీపీసీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.