జాతీయం

భారీగా లాభపడ్డ సూచీలు

ముంబయి దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 291 పాయింట్లు లాభపడి 39,686 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 11,861 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. అమెరికా,చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నెమ్మదించిందనే వార్తలు వీటికి ఊతం ఇచ్చాయి. నేడు ట్రేడింగ్‌లో ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. టాటామోటార్స్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా లాభపడ్డాయి. మిడ్‌క్యాప్‌ సూచీ 81పాయింట్లు, స్మాల్‌ క్యాప్‌ సూచీ 43 పాయింట్లు లాభపడ్డాయి. రియాల్టీ రంగ సూచీలు కూడా బాగా లాభపడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో పార్మా, ఆటోమొబైల్‌, బ్యాంక్‌ సూచీలు ఉన్నాయి.
ఎవ్రిడే ఇండస్ట్రీస్‌ షేర్లు 5శాతం పతనం కావడంతో లోయర్‌ సర్క్యూట్‌ విధించారు. సోమవారం ప్రైస్‌వాటర్‌హౌస్‌ కో ఛార్టర్డ్‌ అకౌంట్స్‌ ఎల్‌ఎల్‌పీ ఆడిటింగ్‌ నుంచి తప్పుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.  రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ షేర్లు 10శాతం  కుంగాయి. రేటింగ్‌ ఏజెన్సీ బ్రిక్‌వర్క్‌ కంపెనీ స్థాయిని తగ్గించి రేటింగ్‌ ఇవ్వడమే దీనికి కారణం.