సినిమా

‘భారత్’ ట్రైలర్‌ వచ్చేసింది

ముంబయి: సల్మాన్‌ ఖాన్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భారత్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. సల్మాన్‌ను ఐదు విభిన్నమైన గెటప్స్‌లో చూపిస్తూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అలీ అబ్బాస్‌ జాఫర్‌ సినిమాకు దర్శకత్వం వహించారు. కత్రినా కైఫ్‌ కథానాయిక. ప్రభుత్వ అధికారిణిగా కత్రినా పాత్ర, లుక్‌ ఆకట్టుకుంటోంది. భారత్‌ అనే వ్యక్తి దేశంతో కలిసి చేసిన ప్రయాణం ఎలాంటిది? అన్న నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఇందులో దిశా పటానీ సల్మాన్‌ సోదరి పాత్రలో నటించారు. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.