జాతీయం

భాజపాపై మండిపడ్ద కేజ్రివాల్

దిల్లీ: భాజపాపై దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. దిల్లీలోని షకూర్‌ బస్తీలో కేజ్రీవాల్ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. భాజపా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు చేత అనుమతి నిరాకరిస్తోందని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో భాజపా చేపట్టిన ఎన్ని ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు? అని ట్విటర్‌లో ప్రశ్నించారు.  దిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో భాజపా ఓటమిని అంగీకరించిందని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల సమయంలో దేశ ప్రజలకు మోదీ ఇచ్చిన హామీలు ఆయన మర్చిపోయారని,  ఇప్పుడు ప్రజలే వాటిని ఆయనకు గుర్తు చేస్తారని పేర్కొన్నారు. ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినా మరో ప్రాంతంలో నిర్వహించనన్న ర్యాలీలో కేజ్రవాల్ పాల్గొనున్నట్టు సమాచారం.