ఆంధ్రప్రదేశ్క్రైమ్

బ్రేకింగ్‌ : మావోయిష్టుల ప్రతీకార దాడి -ఎమ్మెల్యే కిడారి హతం

స్నేహ టీవీ , అరకు: : ఆంధ్ర ప్రదేశ్ అరకు నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్ రావు ను మావోయిస్టులు కాల్చి చంపారు. ఆదివారం గ్రామ దర్శిని సభకు వెళ్లిన ఎమ్మెల్యే పై మావోయిస్టులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. విశాఖ పట్నం జిల్లా డుంబ్రి గూడా మండలం తుండాగి వద్ద మావోయిస్టులు కిడారి పై కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటన లో కిడారి తో పాటు అరకు మాజీ ఎమ్మెల్యే శివేరి సోము కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కిడారి పై మావోయిస్టులు కాల్పులు జరిపిన విషయాన్నీ ఎస్ పీ రాహుల్ దేవ్ నిర్ధారించారు. మావోయిస్టులు దాడి జరిపిన సమాచారం ఉందని , ఘటన స్థలానికి సిబ్బంది బయలు దేరి వెళ్లారని పేర్కొన్నారు. ఈ గతంలో సుమారు యాభై మంది మావోయిస్టులు పాల్గొన్నట్టు తెలుస్తోంది.
వైసీపీ తో టీడీపీ
మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన కిడారి సర్వేశ్వర్ రావు 2014 లో వైసీపీ పార్టీ తరపున గెలిచారు. ఇటీవలే తెలుగు దేశం పార్టీ లో చేరారు. కిడారి కి భార్య ఇద్దరు కుమారులు కిడారి సందీప్, కిడారి శ్రవణ్ కుమార్ ఉన్నారు.
హుడాటాహుటిన గంట
విశాఖపట్నం లో ఓ కార్యక్రమంలో ఉన్న మంత్రి గంట శ్రీనివాస్ రావు హుటా హుటిన విజయ వాడ కు బయలు దేరారు. ఎమ్మెల్యే కిడారిపై మావోయిస్టులు కాల్పులు జరిపిన ఘటన తెలిసిన వెంటనే మంత్రి గంట వైజాగ్ నుంచి విజయవాడ కు బయలు దేరి వెళ్లారు.
పదేళ్లలో ఇదే తొలిసారి
గడచినా పదేళ్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేను మావోయిస్టులు చంపడం ఇదే తొలి సారి. ఏ ఓ బి ఘటన తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అతి పెద్ద సంఘటన అని చెప్పవచ్చు. ఏ ఓ బి ఘటన లో సుమారు ఇరవై మంది మావోయిస్టులు, ఇటీవల ఛత్తీస్ ఘడ్ లో సుమారు నలభై మంది మావోయిస్టులు పోలీసుల చేతుల్లో చనిపోయారు. ఈ నేపథ్యంలోనే జరిగిన ఎమ్మెల్యే కిడారి ఘటన మావోయిస్టుల ప్రతీకార చర్యగా చెప్పుకోవచ్చు.
ఎస్ పీ నిర్ధారణ
సర్వేశ్వర రావుపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్లుగా సమాచారం వస్తోందని, దాడి జరిగిందని తమకు సమాచారం వచ్చిందని, మావోయిస్టుల దాడిని నిర్ధారించేందుకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.