క్రీడలు

బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజీలాండ్‌…

India-vs-New-Zealand
New Zealand started Bating in ICC semi finale

హైదరాబాద్‌: మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు మెరుగైన విజయావకాశాలు ఉన్న నేపథ్యంలో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ టాస్ నెగ్గిన వెంటనే బ్యాటింగ్ అంటూ ఉత్సాహంగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇక టీమిండియాలో కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్ జట్టులోకి రాగా, న్యూజిలాండ్ జట్టులో సౌథీ బదులు లాకీ ఫెర్గుసన్ జట్టులోకి వచ్చాడు. టాస్ ఓడిపోయిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, పిచ్ చాలా ఫ్రెష్ గా ఉందని, టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగే ఎంచుకునే వాళ్లమని తెలిపాడు.

ICC, New Zealand Vs India, World Cup