జాతీయం

బేర్‌మంటున్న మార్కెట్లు

దేశీయ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీగా కుదేలవుతున్నాయి. ఆరంభంలోనే కుప్పకూలిన మార్కెట్లు అంతకంతకూ దిగజారుతూ భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ ఏకంగా 869 పాయింట్లు నష్టపోయి 38,664 వద్ద, నిఫ్టీ 276 పాయింట్ల నష్టంతో 11,535 వద్ద ట్రేడ్‌ అయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 768 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 241 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌30లో కేవలం యస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ తప్ప అన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 9శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. గత 9 నెలల్లో సూచీలు ఒక రోజులో ఇంత భారీగా నష్టపోవడం ఇప్పుడే.