జాతీయం

బీజేపీలో చేరిన మరో ఆప్ ఎమ్మెల్యే

న్యూఢిల్లీ : ఆప్ లో మరో వికెట్ పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే దేవిందర్ కుమార్ షెరావత్ బీజేపీలో చేరారు. దేవిందర్ కుమార్ షెరావత్ కు కేంద్రమంత్రి విజయ్‌గోయల్ కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 3న ఆప్ ఎమ్మెల్యే అనిల్ బాజ్‌పేయ్ ఢిల్లీ బీజేపీ ఇన్‌ఛార్జ్ శ్యాంజాజు, గోయల్ సమక్షంలో ఇప్పటికే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ రూ.10 కోట్ల చొప్పున ఆఫర్ ప్రకటించి..తమ ఎమ్మెల్యేలను బలవంతంగా పార్టీలోకి తీసుకుంటుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియో ఇప్పటికే ఆరోపణలు చేశారు.