జాతీయం

బిజెపికు తొలి విజయం

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బిజెపి  తొలి విజయాన్ని నమోదు చేసింది. దమన్‌ దయ్యూ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి లాలూభాయ్‌ పటేల్‌.. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి కేతన్‌ పటేల్‌పై గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ బిజెపినే గెలుపొందింది. గత ఎన్నికల్లో కేతన్‌ పటేల్‌పై లాలూభాయ్‌ పటేల్‌ 9000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఇక దేశవ్యాప్తంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పూర్తి ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మెజార్టీ మార్క్‌ను దాటి 330కి పైగా స్థానంలో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.