ఆంధ్రప్రదేశ్

బాలిక ప్రాణం తీసిన జెయింట్‌వీల్‌

పాడేరు: రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన విశాఖ జిల్లా మన్యంలోని పాడేరు మోదకొండమ్మ జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. జాతరలో వినోదం కోసం ఏర్పాటు చేసిన జెయింట్‌వీల్‌ నుంచి జారిపడి ఓ బాలిక ప్రాణం కోల్పోయింది. జాతర రెండో రోజైన సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జెయింట్‌వీల్‌ తిరగడం పూర్తయ్యాక జనాలను విడతల వారీగా కిందకు దింపుతున్నారు. ఆ సమయంలో ఓ బాక్సుకున్న బోల్టు లూజ్‌ కావడంతో హఠాత్తుగా ఒరిగిపోయింది. దాంతో బాక్సులో ఉన్న నలుగురిలో ముగ్గురు పట్టుతప్పి కిందపడిపోయారు. వారిలో హుకుంపేట మండలానికి చెందిన భవాని (16) తీవ్రగాయాలై పాడేరు ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందింది. గాయపడిన మిగతా ఇద్దరినీ విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. జాతరలో ఏర్పాటు చేసిన జెయింట్‌వీల్‌కు అధికారుల అనుమతి లేకపోవడం గమనార్హం.