ఆంధ్రప్రదేశ్

బాబు వర్సెస్ జగన్. ఏపీలోనూ వేడెక్కిస్తున్న సర్వేలు… !

(స్నేహ టీవి)  అమరావతి : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో నేతల పరిస్థితి ఇలాగే ఉంది. తెలంగాణలో కేసీఆర్ ముందుగానే ఎన్నికల నగారా మోగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తోపాటు ఆంధ్రలోను ఎన్నికల వేడి మొదలయింది. సాధారణంగా ఆంధ్రాలో 2019మే నెల వరకు ప్రభుత్వానికి గడువు ఉన్నప్పటికీ జనవారిలోనే ఎన్నికలొస్తాయనే ప్రచారం జరుగుతోంది.

 

 

 

ఎన్నికల వాతావరణంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ నేత భవిష్యత్తు ఎలా ఉంటుందో, ప్రజల్లో ఎవరికి ఎంత పలుకుబడి ఉందన్న అంశంపై సర్వేల హడావుడి జనంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కించింది. ఒక సర్వేలో వెల్లడైన సంగతులు సంచలనం కలిగించాయి. ఆజ్‌త‌క్‌లో ప్రసార‌మైన సర్వే ఫలితాలు ఇపుడు హాట్టాపిక్ గా మారాయి. వీరి సర్వేలో జగన్ అనూహ్యంగా టాప్ లీడర్ అయ్యారు. ఏపీలో సీన్ రివ‌ర్స్ అయ్యి చంద్ర‌బాబు పాపులారిటీ పడిపోయినట్లు చూపారు. విపక్ష నేత జ‌గ‌న్కు పాపులారిటీ పెరిగిపోయింది. సర్వేలో మీ లీడ‌ర్ ఎవ‌రు అని అడిగిన ప్ర‌శ్న‌కు 43 శాతం మంది జ‌గ‌న్ పేరు చెప్పగా కేవ‌లం 38 శాతం మంది మాత్ర‌మే చంద్ర‌బాబు పేరు చెప్పారట. 5 శాతం మంది ప‌వ‌న్ పేరు చెప్పారు.